Header Banner

ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో తెలుగుదేశం నేత ఇంట తీవ్ర విషాదం! ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న తెలుగు వారు!

  Sun May 18, 2025 20:30        Helping Hand, Australia

అందరికీ ఆప్తుడు, ఎంతో స్నేహ గుణం కలిగి సహాయం కోసం అడిగిన వారికి తప్పక సహాయం చేసే వ్యక్తి, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న సోమవరపు పరిపూర్ణ గారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వారి సతీమణి సోమవరపు అనుపమ గారు కాన్సర్ తో తీవ్ర పోరాటం చేసి నిన్న అనగా 17 మే, 2025 న మరణించారు. పరిపూర్ణ గారు 1985లో విశాఖ స్టీల్ ప్లాంట్ లో తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. 1989లో ఆయన ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. 1995-2005 వరకు ఆస్ట్రేలియా డిఫెన్సులో, 2005-2015 మధ్యలో బ్యూరో ఆఫ్ మీటియరాలజీలో తన సేవలు అందించారు. పరిపూర్ణ గారు 2009 లో అమరనేని శశేంద్ర, గుల్లాపల్లి ఉష, మోటూరి శివాజీ, వాసిరెడ్డి కిశోర్ తో కలిసి టీడీపీ మెల్బోర్న్ ను స్థాపించి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. అలాగే 2008-2009 వరకు ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత తెలుగు అసోసియేషన్ TAAI ప్రెసిడెంట్ గా తన సేవలను అందించారు. 

Aus Paripoorna Family.jpeg

 

ఆయన 1991 లో అనుపమ గారిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, వారు కూడా ఆస్ట్రేలియాలోనే తమ చదువు పూర్తి చేసి అక్కడే ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అనుపమ గారు కూడా 1998 నుండే టాక్స్ కన్సల్టెంట్ గా తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆమెకు జూన్ 2023లో కాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవ్వడంతో వారు అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాన్సర్ తో సుధీర్ఘమైన పోరాటం తర్వాత నిన్న ఆవిడ తుది శ్వాస విడిచారు. అనుపమ గారి మరణం ఆ కుటుంబానికి కోలుకోలేని విషాదం. ఈ వార్త తెలుసుకున్న మెల్బోర్న్ లో నివసిస్తున్న తెలుగు వారు అందరూ ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే పరిపూర్ణ గారి ఇంట ఇంతటి విషాదం సంభవించడంతో అందరూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ విషయం తెలుసుకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి బంధుమిత్రులు తమ విచారాన్ని వ్యక్తపరుస్తున్నారు. అదే విధంగా తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలు కూడా తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక పోతే 21 మే 2025, ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరంలో ఉన్న స్ప్రింగ్ వాలే క్రెమెటోరియం లో సోమవరపు అనుపమ గారి అంతిమ యాత్ర కార్యక్రమం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారికి అంతిమ నివాళి సమర్పించి ఆ కుటుంబానికి తోడుగా నిలవాలని సన్నిహితులు కోరారు.

 

సౌమ్యుడు, అందరివాడు, అయిన పరిపూర్ణ గారు తన జీవిత భాగస్వామిని కోల్పోయిన ఈ సమయంలో వారికీ వారి కుటుంబానికి ఆంధ్ర ప్రవాసీ తరపున మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము. అనుపమ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. - చప్పిడి రాజ శేఖర్

S Anupama Last Rites.jpeg 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 
 


   #AndhraPravasi #HelpingHand #Condolences #Australia #NRITDPAustralia #NRITDP